జీవిత కాలపు అధ్యక్షుడనేది మా అభిమతమే… జగన్ ఆనాడే తిరస్కరించారు : సజ్జల క్లారిటీ

వైసీపీకి జగన్ జీవిత కాలపు అధ్యక్షుడిగా వుండటం అప్రజాస్వామికమని, ఈసీ నోటీసులిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ స్పందించింది. జీవిత కాలపు అధ్యక్ష తీర్మానాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్షా రెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ ఈ తీర్మానాన్ని తిరస్కరించడం వల్ల ఆ నిర్ణయం మినిట్స్ లోకి ఎక్కలేదని తేల్చి చెప్పారు. అయితే.. జగన్ జీవిత కాలపు అధ్యక్షుడిగా వుండాలన్నది కార్యకర్తల అభిమతం మాత్రమేనని అన్నారు. ఐదేళ్లకోసారి అధ్యక్ష ఎన్నిక జరగాలని గత ఫిబ్రవరిలోనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇదే విషయాన్ని ఈసీకి కూడా తెలియజేశామని ఆయన అన్నారు. అయితే.. ప్లీనరీ సమయంలో ఈ ప్రతిపాదన మళ్లీ తెరపైకి రావడంతోనే ఈసీ దీనిపై స్పష్టత అడిగిందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనేది ఐదేళ్లకోసారి నిర్వహిస్తామన్న అంశాన్ని ఈసీకి తెలుపుతున్నామని అన్నారు.

 

ఇక… ఎన్టీఆర్ పై తమకు అపారమైన గౌరవం వుందని సజ్జల అన్నారు. సీఎం జగన్ ఎన్టీఆర్ కు అత్యంత గౌరవం ఇచ్చారని, ఎన్టీఆర్ పేరును జిల్లాకు కూడా పెట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరు చరిత్రలో తెర మరుగు కావాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఎన్టీఆర్ పేరు వింటే చంద్రబాబుకు వెన్నుపోటు గుర్తుకు వస్తుందని విమర్వించారు. చంద్రబాబు ఎన్టీఆర్ ను మానసికంగా క్షోభ పెట్టారని, ప్రాయశ్చిత్తంగానే యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టామని సజ్జల పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్