శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19 న రవీంద్ర భారతిలో 1,000 సాంస్కృతిక సహస్ర మహోత్సవాల సంబరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సంస్థ 37 వ వార్షికోత్సవం ఉదయం 9 గంటలకు సంప్రదాయబద్ధంగా ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. విఖ్యాత నృత్య దర్శకురాలు వెంపటి శ్రావణి, నాట్య విజ్ఞాన్ రాధా మోహన్ కళారూపాలు, ప్రత్యేక ప్రదర్శనలు కూడా వుంటాయని సంస్థ తెలిపింది. 15 దేవాల నుంచి కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. ఈ ఉత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి, వి. శ్రీనివాస్ గౌడ్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు హాజరవుతారని సంస్థ తెలిపింది.