తెలంగాణ   రాష్ట్ర కేబినెట్ లో మహిళలకు చోటిస్తే చెడు జరుగుతుందని తాంత్రికులు చెప్పడంతో సీఎం కేసీఆర్ మహిళలను కేబినెట్లోకి తీసుకోలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్స్ చేశారు. దీనిపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. అమ్మా నిర్మలా సీతారామన్ గారూ.. తెలంగాణ రాష్ట్ర  కేబినెట్ లో ఇద్దరు మహిళా మంత్రులం ఉన్నాం అంటూ కౌంటర్ ఇచ్చారు. నేను, నా కొలీగ్ సత్యవతి రాథోడ్ మంత్రులుగా పనిచేస్తున్నాం. మూడేళ్లుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు మేం మంత్రులుగా సేవలందిస్తున్నాం. ఇద్దరు మహిళా మంత్రులు తెలంగాణ కేబినెట్ లో ఉన్నారన్న కనీస సమాచారం మీకు తెలియకపోవడం బాధాకరం అని మంత్రి  సబితా కౌంటర్ ఇచ్చారు.