ఓ మంచి పొరుగు దేశంగా పేరు తెచ్చుకోండి… పాక్ కు హితవు పలికిన జైశంకర్

ఐక్యరాజ్య సమితి వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మళ్లీ పాకిస్తాన్ ను దునుమాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిపోయిందన్న విషయం ప్రపంచం ప్రపంచమే గుర్తించిందని, ప్రపంచమేమీ మూర్ఖంగా లేదని, చేస్తున్న ప్రతి పనినీ గమనిస్తూనే వుందని పాక్ కు చురకలంటించారు. అయినా… తాము చెప్పే మంచి సలహాలను స్వీకరించే స్థాయిలో కూడా పాకిస్తాన్ మానసిక స్థితి లేదని, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతందో ప్రపంచానికే తెలిసిపోతోందని అన్నారు. ఓ మంచి పొరుగు దేశంగా మసులుకుంటూ, మంచి పొరుగు దేశంగా పేరు తెచ్చుకోండంటూ హితవుపలికారు. మన పెరట్లో పాములను మనమే పెంచినా… అవి పక్కింటి వారినే కాటేస్తాయని అనుకోవడం మన మూర్ఖత్వమని, మన పాములే అయినా… మనం పెంచుకున్నవే అయినా… మనల్ని కాటేయవచ్చన్న హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యలను జైశంకర్ గుర్తుచేశారు.

 

ఇకనైనా ఆ దేశం తమ చేష్టలను మానుకొని, పొరుగు దేశాల పట్ల స్నేహంగా వుండాలని సూచించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ ప్రపంచం అవలంబించాల్సిన విధానాలపై ఐరాస భద్రతా మండలిలో భారత్ అధ్యక్షతన చర్చ జరిగింది. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రపంచం ఆలోచనలన్నీ కరోనా చుట్టే వున్నాయని, కానీ… ప్రపంచం ఏమీ మూర్ఖంగా లేదని, ఉగ్రవాదం ఎక్కడి నుంచి మొదలైందో అందరికీ తెలుసని జైశంకర్ చురకలంటించారు.

 

Related Posts

Latest News Updates