‘S-99 ‘టీజర్ ను లాంచ్ చేసిన దర్శకేంద్రుడు,

టెంపుల్ మీడియా పతాకంపై సి. జగన్మోహన్ ( మాయాబజార్ జగన్మోహన్ ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S-99 ‘. ఇటీవలే ఫస్ట్ లుక్ ను ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ రిలీజ్ చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే.. కాగా ఈ చిత్ర టీజర్ ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నేడు విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘ఈ టీజర్ ని చూశాను. చాలా అద్భుతంగా అనిపిస్తుంది టెక్నికల్ గా కావచ్చు. కెమెరా వర్క్ చాలా కొత్తగా అనిపిస్తుంది. తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.

ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు జగన్మోహన్ మాట్లాడుతూ, ‘S-99 ‘ టీజర్ను రాఘవేంద్రరావు గారు లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ఆరు టీజర్ లను వివిధ రకాలుగా రిలీజ్ చేస్తామని తెలిపారు. ‘S99’ చిత్రం వచ్చేనెల మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

హీరో: జగన్మోహన్
హీరోయిన్: శ్వేతా వర్మ
కెమెరా:వీ. శ్రీనివాస్
ఎడిటర్: సనాల్ అనిరుదన్
డైరెక్టర్: జగన్మోహన్
ప్రొడ్యూసర్స్: యతీష్ అండ్ నందిని
పి ఆర్ ఓ :బి. వీరబాబు

Related Posts

Latest News Updates