గుజరాత్లో ఎన్నికల షెడ్యూల్కు ముందే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నది. ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా ఆదివారం ఐదో విడుతలో 12 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. భుజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజేశ్ పండోరియా, సబర్మతి నుంచి జస్వంత్ ఠాకోరీ, టంకారా నుంచి సంజయ్ భట్సన్, కోడినార్ నుంచి వల్జీభాయ్ మక్వానా, దామోర్ నుంచి అనిల్ గరాసియా, ఝలోద్, దేదీయపడ నుంచి చైతర్ వాసవ్, మహుధ నుంచి ఉదైసింగ్ నుంచి రవిజీభాయ్ సోమాభాయ్ వాఘేలాకు సీట్లు కేటాయించింది. మోర్వా నుంచి బవాభా హడాఫ్, ఇదార్ నుంచి జయంతిభాయ్ పర్ణమి, నికోల్ నుంచి అశోక్ గజేరా, వ్యారా నుంచి బిపిన్ చౌదరి సుమకు ఆమ్ ఆద్మీ పార్టీ సీట్లు కేటాయించింది.