ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ అయిన ”నాటు నాటు” సాంగ్

ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’సృష్టించిన రికార్డుల గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లు సాధించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు సైతం పొందింది. అలాగే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పలు అవార్డులు కూడా గెలుచుకుంది. ఆస్కార్స్‌ అవార్డుల కార్యక్రమంలో పలు విభాగాల కోసం ఈ చిత్రం పోటీకి నిలిచింది. తాజాగా ఆస్కార్స్‌లోని ‘బెస్ట్ ఓరిజినల్ సాంగ్’విభాగంలో పోటీ పడేందుకు ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ షార్ట్ లిస్ట్ అయ్యింది.

 

ఈ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 81 పాటలు పోటీపడగా.. అందులో నుంచి టాప్ 15 పాటలను ఈ అవార్డుల కమిటీ విడుదల చేసింది. అందులో ‘నాటు నాటు’ పాటకి కూడా చోటు దక్కడం విశేషం. నాటు నాటుతో పాటు ఈ జాబితాలోని అవతార్: ది వే ఆఫ్ వాటర్ నుండి ‘నథింగ్ ఈజ్ లాస్ట్’, బ్లాంక్ పాంథర్ నుండి ‘లిఫ్ట్ మి అప్’: వకాండ ఫరెవర్, టాప్ గన్: మావెరిక్ నుండి ‘హోల్డ్ మై హ్యాండ్’ ఉన్నాయి. ఆస్కార్‌ నామినేషన్స్‌లో పోటీ పడనున్న చిత్రాల షార్ట్‌లిస్ట్‌ను ప్రకటించిన అకాడమీ…10 విభాగాలకు సంబంధించిన జాబితాలో 4 విభాగాల్లో భారతీయ చిత్రాలు స్థానాన్ని దక్కించుకున్నాయి.

Related Posts

Latest News Updates