దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి అవార్డుల పంట పండుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ కు అడుగు దూరంలో ఉంది. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. బెస్ట్ స్టంట్స్ కేటగిరీలో (హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవార్డు వరించింది. ఈ అవార్డును రాజమౌళి అందుకున్నారు. కేవలం స్టంట్స్ కేటగిరీలోనే కాకుండా ఈ అవార్డు వేడుకల్లో బెస్ట్ యాక్షన్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ సాంగ్‌తోపాటు స్పాట్ లైట్ అవార్డును కూడా అందుకున్నారు రాజమౌళి అండ్ టీమ్. రాజమౌళి, రామ్‌చరణ్ తదితరులు ఈ వేడుకలో భాగమయ్యారు. ‘బెస్ట్ యాక్షన్ ఫిల్మ్’ కేటగీరీలో ఏరియల్ కంబాట్ ఫిల్మ్ ‘టాప్ గన్: మేవరిక్’, ‘బ్లాక్ పాంథర్’, ‘బ్యాట్ మ్యాన్’, ‘విమెన్ కింగ్’ ఉన్నప్పటికీ ఆ సినిమాలను పక్కకు నెట్టి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ‘బెస్ట్ యాక్షన్ ఫిల్మ్’ అవార్డు సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా HCA కి రాజమౌళి ధన్యవాదుల ప్రకటించాడు. ఎంతగానో శ్రమించి ఇందులో స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన సాల్మన్, క్లైమాక్స్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు కంపోజ్ చేసిన జూజీతో పాటు కష్టపడిన వారందరికీ ధన్యవాదాలు ప్రకటించారు. అయితే… ఇకపై అవార్డుల జాబితాలో స్టంట్ కొరియోగ్రాఫర్స్ విభాగాన్ని కూడా చేర్చాలని రాజమౌళి కోరారు. సినిమాలోని రెండు మూడు షాట్స్ లో మాత్రమే డూప్స్ ని వాడామని, మిగతావన్నీ ఎన్టీఆర్, రాంచరణ్ స్వయంగా చేసినవేనన్నారు. ఇది కేవల నాకు, నా చిత్రానికే కాదు.. భారతీయ సినిమాకి దక్కిన గౌరవం అని పేర్కొన్నారు.