రోషన్ కనకాల, సందీప్ రాజ్, TG విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మోగ్లీ 2025 గ్రాండ్ గా లాంచ్

తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకుని యంగెస్ట్ దర్శకుడిగా గుర్తింపు పొందిన సందీప్ రాజ్ మరో ఎమోషనల్ రిచ్ స్టోరీతో రాబోతున్నారు. మోగ్లీ 2025 టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో తన చార్మ్ అండ్ డ్యాన్స్ మూవ్స్ తో అలరించిన రోషన్ కనకాల హీరోగా నటిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కాంటెంపరరీ లవ్ స్టోరీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజనరీ ప్రొడ్యూసర్ TG విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా డెబ్యుటెంట్ సాక్షి సాగర్‌ మదోల్కర్‌ నటిస్తున్నారు.

మోగ్లీ 2025 మూవీ పూజా కార్యక్రమాలతో ఈరోజు గ్రాండ్ లాంచ్ అయింది. రోషన్ కనకాల, సాక్షి సాగర్ మదోల్కర్‌లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి సందీప్ రెడ్డి వంగా క్లాప్‌ ఇచ్చారు, దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

రోషన్ కనకాల ఛార్మింగ్ గా కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మోగ్లీ 2025 టైటిల్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.

మోగ్లీ 2025కి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కలర్ ఫోటో కు సక్సెస్ ఫుల్ సౌండ్‌ట్రాక్స్ అందించిన కాల భైరవ సంగీతం సమకూర్చనున్నారు. బాహుబలి 1 & 2, RRR వంటి భారీ బ్లాక్‌బస్టర్‌లలో చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన రామ మారుతి ఎమ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. కలర్ ఫోటో, మేజర్, అప్ కమింగ్ గూడాచారి 2 చిత్రాలకు పని చేసిన పవన్ కళ్యాణ్ ఎడిటర్.

మోగ్లీ 2025 చిత్రాన్ని 2025 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం: రోషన్ కనకాల, సాక్షి సాగర్ మడోల్కర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: కాల భైరవ
డిఓపి: రామ మారుతి ఎం
ఎడిటర్: పవన్ కళ్యాణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
Mowgli Event Pics 01.jpg
Mowgli Event Pics 04.jpg
Mowgli Event Pics 07.jpg
Mowgli Event Pics 11.jpg
Mowgli Event Pics 13.jpg
Mowgli Event Pics 15.jpg

Related Posts

Latest News Updates