హీరో చ‌రణ్ రొరి యాక్ష‌న్ విజ‌వ‌ల్స్ స్పెక్టాక్యుల‌ర్ ‘రొరి’ మూవి టీజ‌ర్

భ‌ద్రం బీకేర్ ఫుల్ బ్ర‌ద‌ర్ సినిమా తో అంద‌రికి సుప‌రిచితుడైన చ‌ర‌ణ్ హీరోగా క‌రిష్మా హీరోయిన్ గా చ‌ర‌ణ్ రొరి ద‌ర్శ‌క‌త్వం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం రొరి.. ఈ చిత్రాన్ని సి టి ఎఫ్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. ఈచిత్రం లో లెజెండ్ కొటా శ్రీనివాస‌రావు, జ‌య‌ప్ర‌కాష్‌, దేవిప్ర‌సాద్ లాంటి ప్యాడింగ్ న‌టీన‌టుల‌తో అత్యంత భారీగా తెర‌కెక్కించారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈచిత్రాన్ని ద‌ర్శ‌క‌త్వం చేస్తూ హీరొ గా నటిస్తున్నారు చ‌ర‌ణ్ రొరి, ఈ చిత్ర నిర్మాణ భాద్య‌త‌లు కూడా చ‌ర‌ణ్ చూసుకుంటున్నారు. రొరి చిత్రం యోక్క టీజ‌ర్ ఈరోజు విడ‌దల‌య్యింది. ఫుల్ యాక్ష‌క్ విజువ‌ల్స్ తో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఆక‌ట్టుకుంది. చ‌ర‌ణ్ ఒ విభిన్న పాత్ర లో న‌టించాడు. అంతేకాదు టీజ‌ర్ లో ఒ ఇన్విస్టిగేష‌న్ చేసే ఇంట్ర‌స్టింగ్ కేర‌క్ట‌ర్ అనిపించింది. గెట‌ప్ కూడా కామ‌న్ ప‌ర్స‌న్ గా యాక్ష‌న్ చేస్తూ ఇటీవ‌ల సీతారామం సినిమా చేసిన లొకేష‌న్స్ లో యాక్ష‌న్ సీన్స్ ఆక‌ట్టుకున్నాయి.  ఈ సంద‌ర్బంగా చ‌ర‌ణ్ రోరి మాట్లాడుతూ.. ఈ చిత్రం మోద‌టిలుక్ టీజ‌ర్ ని విడుద‌ల చేసాము .. మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క‌థ విష‌యానికోస్తే హైద‌రాబాద్ పోలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ ఓ జ‌రిగే కుర్రాడి క‌ధ‌, అనుకోని పరిస్థుతుల్లో ఆ కుర్రాడు పాకిస్థాన్ ని వెళ్ళాల్సివ‌చ్చింది, అక్క‌డ కొంత‌మంది హిందువుల‌ని క‌లిసి వారి క‌ష్టాలు తెలుసుకుని వారితో ఇండియాకి క్షేమంగా వ‌చ్చాడా లేదా అనేది ఈ చిత్ర క‌థ‌, అస‌లు హైద‌రాబాద్ కి , పాకిస్థాన్ కి మ‌ద్య ఏంటి సంబందం అనేది ఈచిత్రం లో ఇంట్ర‌స్టింగ్ పాయింట్‌. ఈ చిత్ర క‌థ‌నం ఆద్యంతం ఉత్కంఠ భ‌రితం గా వుంటుంది. త్వ‌ర‌లో విడుద‌ల తేదిని తెలియ‌జేస్తాము. అని అన్నారు న‌టీన‌టులు.. చ‌ర‌ణ్ రొరి, క‌రిష్మా, కొటా శ్రీనివాస‌రావు, జ‌య‌ప్ర‌కాష్‌, దేవిప్ర‌సాద్‌, కాదంబ‌రి కిర‌ణ్‌కుమార్, సూర్య‌, ముఖ్తార్ఖాన్‌, బ్యాంక్ సూర్య‌, చ‌ర‌ణ్‌దీప్‌, ఫ‌ణికాంత్‌, వేణుగోపాల్‌, ప్ర‌స‌న్న‌, ర‌విప్ర‌కాష్‌,ఆలీ రెజా, స‌మ్మెట గాంధి, రాజ‌శేఖ‌ర్ త‌దిత‌రులు సాంకేతికనిపుణులు.. మ్యూజిక్‌.. భీమ్స్ సెసిరొలియో ఫోటోగ్ర‌ఫి.. ధాశ‌ర‌ది శివేంద్ర‌ ఎడిట‌ర్‌.. కార్తిక్ శ్రీనివాస్‌ ఆర్ట్‌.. హ‌రిక పొట్ట‌ నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం.. చ‌ర‌ణ్ రోరి

Related Posts

Latest News Updates