లావెర్ కప్‌లో ఫెదరర్, నాదల్ శుక్రవారం డబుల్స్ మ్యాచ్ ఆడారు. టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫెదరర్ .. తన చివరి మ్యాచ్ ఆడేశాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఫెదరర్ భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఇక… తన చిరకాల మిత్రుడు టెన్నిస్ కోర్టులో కనిపించడన్న బాధను కన్నీటి రూపంలో బయటపెట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోర్టులో వీరిద్దరూ ఢీ అంటే ఢీ అనేలా ప్రత్యర్థుల్లా తలపడినా…. కోర్టు బయట మాత్రం వీరిద్దరూ మంచి మిత్రులు. తన మిత్రుడు ఆటకు వీడ్కోలు పలికాడని ఒకరు ఏడిస్తే.. మరొకరు.. తన స్నేహితుడు ఏడ్చేస్తున్నాడని ఏడ్చేశాడు. కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.
https://twitter.com/barstoolsports/status/1573461290164551681?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1573461290164551681%7Ctwgr%5Eebb321e61bc7916509f3d6f92741aba17b6714e3%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fnews%2Frafael-nadal-in-tears-as-roger-federer-plays-last-match-watch-video-774947
రెండు దశాబ్ధాల పాటు ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఇద్దరు కలిసి 42 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచారు. 2004లో తొలిసారి పోటీపడ్డ ఆ ఇద్దరు .. వారి మధ్య 40 సార్లు గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు జరిగాయి. 9 గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఆడారు. రోజర్ ఫెదరర్ తన కెరీర్ లో చివరి మ్యాచ్ ను రఫెల్ నాదల్ తో జోడీగా ఆడాడు. అయితే.. ఈ మ్యాచ్ లో ఈ జోడీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ తో ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ ముగిసింది. ఇక…. ఫెదరర్ తోటి ఆటగాళ్లు, ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించాడు. ఈ సుదీర్ఘ కెరీర్ లో తనకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన తన భార్య మిర్కాను హత్తుకొని, తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.