ఏపీ మంత్రి పెద్దిరెడ్డి,ఎంపీ మిథున్ రెడ్డికి తప్పిన ప్రమాదం

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డికి పెద్ద ప్రమాదం తప్పింది. బంధువుల ఇంటికి వెళ్తుండగా… కాన్వాయ్ లోని ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన వాహనాన్ని మరో కారు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆ కారు పల్టీలు కొట్టి కిందపడిపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులంతా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుంచి వీరబల్లిలోని అత్తారింటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయాల పాలైన ఎంపీ మిథున్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Related Posts

Latest News Updates