టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీకి తప్ప, రాజకీయాలకు పనికిరారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. మాజీ సీఎం చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారని, ఆయన వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని… ఇవి పవన్ కి కనిపించడం లేదా? అంటూ నిలదీశారు.
ఇంత జరుగుతున్నా… పవన్ నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇరుకు రోడ్లల్లో సభలు పెడుతున్నారని, దీంతో జనాన్ని చంపేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదవాడి ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా? అంటూ నిలదీశారు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు 40 మందిని చంపారని రోజా మండిపడ్డారు.












