వలసలపై బ్రిటన్ ప్రభుత్వం కలవరం చెందుతోంది. ముఖ్యంగా విద్యార్థుల వలసలనూ నియంత్రించేందుకు కొత్త విధానం తీసుకురావాలని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భావిస్తున్నారు. విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గించడం సహా అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నారని కార్యాలయ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నాసిరకం డిగ్రీలు, తమపై ఆధారపడేవారిని వెంట తెచ్చుకోవడం తదితర అన్ని చర్యలకూ అడ్డుకట్ట వేసేందుకు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. 2021లో బ్రిటన్కు 1,73,000 మంది వలసరాగా, ఈ ఏడాది 5,04,000 మంది వచ్చారని ఓఎన్ఎస్ (జాతీయ గణాంకాల కార్యాలయం) వెల్లడించింది. ఒక్క ఏడాదిలోనే వలసల సంఖ్య 3.31 లక్షలు పెరిగిపోవడంపై బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. చైనా విద్యార్థుల సంఖ్యను అధిగమించి తొలిసారిగా ఈ ఏడాది భారత విద్యార్థులు అత్యధిక సంఖ్యలో బ్రిటన్ వచ్చారు.












