మోదీతో రిషి సునాక్ భేటీ తర్వాత… భారతీయ యువకులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన బ్రిటన్

బ్రిటన్ ప్రధాని భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పారు. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి ఆమోదం తెలిపారు. ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత ఈ పరిణామం జరిగింది. జీ 20 సదస్సు వేదికగా ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రిషితో భేటీ అయ్యారు. ఈ పథకంలో లబ్ధి పొందే మొదటి వీసా నేషనల్ కంట్రీ భారత దేశమేనని తెలిపింది. గత ఏడాది ఇరు దేశాల మధ్య కుదిరిన యూకే-ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్‌షిప్ క్రింద ఈ పథకాన్ని రూపొందించారు. యూకే ఇండియా యువ నిపుణుల వీసా పథకాన్ని తాము ప్రకటిస్తున్నామని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈ పథకం కింద భారత్ కి చెందిన డిగ్రీ పూర్తి చేసిన వారికి ఏటా 3 వేల వీసాలు అందజేస్తామని, వారు యూకేకి వచ్చి 2 సంవత్సరాల వరకు చదువుకోవడం, ఉద్యోగం చేసేకునే వీలుంటుందని ప్రకటించింది.

 

ఇరు దేశాల మధ్య ఈ నిర్ణయం సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, రెండు ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ఇండో పసిపిక్ ప్రాంతంలో బలమైన బంధాలను ఏర్పర్చుకోవడానికి ఈ పథకం ఉపయోగకారి అని బ్రిటన్ పీఎంవో పేర్కొంది. రిషి బ్రిటన్ ప్రధాన మంత్రి పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బ్రిటన్, భారత్ మధ్య వ్యాపార ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే ఓ యూరోపియన్ దేశంతో భారత్ ఇటువంటి ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది.

Related Posts

Latest News Updates