రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా నియమితులయ్యారు. బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 ఆయనను ప్రధానిగా అధికారికంగా ప్రకటించారు. రిషి సునాక్ నేడు బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 తో భేటీ అయ్యారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కింగ్ ఛార్లెస్ 3 నుంచి వచ్చిన ఆహ్వానాన్ని రిషి అంగీకరించారు. ప్రధానిగా నియమితులైన తర్వాత రిషి తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో వుందని, బ్రిటన్ ప్రజల కోసం అహర్నిషలు పనిచేస్తూనే వుంటానని హామీ ఇచ్చారు. మాటలతో కాదని, చేతలతో దేశాన్ని ఏకం చేస్తానని ప్రకటించారు. పూర్తి పారదర్శకత, నమ్మకంతో ప్రభుత్వాన్ని నడుపుతానని ప్రకటించారు. కచ్చితంగా దేశ ప్రజల నమ్మకాన్ని చూరగొంటానన్న నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తం చేశారు.