ఫాం హౌజ్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు జరిగిన వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తమతో పలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు టచ్ లోనే వున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారని గుర్తు చేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా చూపించారు. పార్టీ కొనుగోళ్లపై తొందరపడి ఓ కోయిల ముందే కూసేసిందని రఘునందన్ రావును ఉద్దేశించి రేవంత్ చురకలంటించారు.