న్యాయ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి…

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన లా కోర్సు ప్రవేశ పరీక్షలో దేశం మొత్తం మీద 22 న్యాయ విశ్వవిద్యాలయాల్లో 3000 మంది యుజి కోర్సుకు మరియు 1100 మంది పిజి కోర్సులలో సెలెక్ట్ చేయగా వారిలో కేవలం 290 మంది మాత్రమే వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు సెలెక్ట్ చేయబడ్డారు అనియు,  13 విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ సౌకర్యం అసలు అమలు చేయలేదనియు , దేశంలో ఉన్న అన్ని న్యాయ విశ్వవిద్యాలయాల్లో 27 శాతం రిజర్వేషన్లు ఓబీసీ వర్గాలకు తప్పనిసరిగా కేటాయించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ కిరెణ్ రిజిజు గారికి ద్రావిడ దేశం అధ్యక్షులు వి. కృష్ణారావు లేఖ రాశారు.‌ ఉదాహరణకు హైదరాబాదులో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ సెంటర్లో  18 శాతం, బెంగళూరులో 16.2 శాతం,  భోపాల్ లో 14 శాతం, రాయపూర్ లో 12.9 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించారని ఒక్క తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే 69 శాతం రిజర్వేషన్లు ఈ సంవత్సరం కల్పించారనియు దేశంలోని ఒక్కొక్క న్యాయ విశ్వవిద్యాలయంలో ఒక్కొక్క రకంగా చాలా తక్కువ శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని న్యాయంగా అన్ని రాష్ట్రాలలో రిజర్వేషన్ అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కృష్ణారావు కోరారు. సామాజిక న్యాయం పాటించే మహారాష్ట్రలో కూడా రిజర్వేషన్ సరిగా పాటించటం లేదని ఈ విషయంలో కలగజేసుకొని వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ వర్గాలకు న్యాయం జరిగే విధంగా దేశ మొత్తం మీద రిజర్వేషన్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రిని కృష్ణారావు కోరారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్