ఆస్కార్ ను మీ ఖాతాలో మాత్రం వేసుకోకండి : ఖర్గే వ్యాఖ్యలు

RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం, అలాగే ”ది ఎలిఫెంట్ విస్పరర్స్” షార్ట్ ఫిల్మ్ కి ఆస్కార్ వచ్చింది. దీంతో RRR టీమ్ కి, ఎలిఫెంట్ విస్పరర్స్ షార్ట్ ఫిల్మ్ యూనిట్ కి దేశ ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ కూడా ఇరువురికీ ఆస్కార్ రావడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ ధన్కర్ కూడా కంగ్రాట్స్ చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే కూడా ఇరువురికీ కంగ్రాట్స్ చెప్పారు.

అయితే… ఆయన అధికార బీజేపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. దయచేసి ఈ ఆస్కార్‌ అవార్డుల క్రెడిట్‌ను మాత్రం మీ ఖాతాలో వేసుకోకండి. ఆ సినిమాలను డైరెక్ట్‌ చేసింది మోదీనే అని, పాట రాసింది మేమే, డైరెక్ట్‌ చేసింది మేమే అని చెప్పకండి. అదొక్కటే నా విజ్ఞప్తి’ అని ఖర్గే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఖర్గే ఆ మాట అనగానే ప్రతిపక్ష పార్టీల సభ్యులంతా ఒక్కసారిగా గొల్లున నవ్వారు. ఇక… అధికార పక్ష నుంచి పీయూష్‌ గోయల్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ, కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ కూడా గొల్లున నవ్వారు.

Related Posts

Latest News Updates