ఒకప్పుడు గ్యాప్ లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసిన నారా రోహిత్ గత కొన్నాళ్లుగా స్క్రీన్ పైన కనిపించింది లేదు. ఇప్పుడు తన కెరీర్లోనే మంచి హిట్ గా నిలిచిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా ప్రతినిధి2 అంటూ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు రోహిత్. ఈ సినిమాతో టీవీ5 మూర్తి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. పొలిటికల్ సినిమా అవడం, ఎలక్షన్ కు ముందు రిలీజ్ ప్లాన్ చేయడంతో సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
దానికి తోడు టీజర్, ట్రైలర్ కూడా బావుండటంతో ఆ ఆసక్తి ఇంకాస్త పెరిగింది. అయితే ఈ సినిమాను ముందుగా ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ ఏప్రిల్ 25కు పోస్ట్‌పోన్ అయింది. కానీ ఏప్రిల్ 25కు కూడా సినిమా రిలీజ్ కాలేదు. సెన్సార్ లేదా మరే ఇతర ఇబ్బందులతోనో ప్రతినిధి2 రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ గా మే 10ని ఫిక్స్ చేశారు.
అంటే ఎలక్షన్స్ కు సరిగ్గా మూడు రోజుల ముందు. సినిమాలో ఏపీ సీఎంను పరోక్షంగా టార్గెట్ చేసే సీన్స్ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలా అని ఇదేమీ ప్రాపగండా సినిమా కాదు. ఇలాంటి సినిమా ఎలక్షన్స్ కు ముందొస్తేనే ఏదైనా ప్రయోజనం. అలా కాకుండా ఎలక్షన్స్ తర్వాత వస్తే సినిమా తీసిన ప్రయోజనమైతే నెరవేరకపోవచ్చు. మరి ప్రతినిధి2 సెన్సార్, మిగిలిన అడ్డంకులను దాటుకుని ఈసారైనా రిలీజవుతుందా లేదా చూడాలి.