మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ సహా మొత్తం ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నళిని, ఆమె భర్త, శ్రీహరన్ అలియాస్ మురుగన్, సంథన్, రాబర్ట్ పాయస్, జయకుమార్‌లు తమిళనాడులోని ఆయా జైళ్ల ఉంచి అధికారికంగా విడుదలయ్యారు. మరో వ్యక్తి ఆర్పీ రవిచంద్రన్ కూడా త్వరలో విడుదల కానున్నారు. ఇప్పటికే పెరోల్‌పై ఉన్న నళిని తన తప్పనిరి హాజరు నమోదు కోసం శనివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అనంతరం వెల్లూరులోని మహిళ ప్రత్యేక జైలుకు చేరుకున్నారు. లాంఛనాలన్నీ పూర్తయ్యాక అక్కడినుంచి విడుదలయ్యారు. తదనంతరం సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఇక్కడి నుంచి విడుదలైన ఆమె భర్త శ్రీహరన్, సంథన్‌కు కులసుకునన్నారు. ఈ ఇద్దరు శ్రీలంక జాతీయులు కావడంతో పోలీసు వాహనంలో తిరుచిరాపల్లిలోని శరణార్థి శిబిరానికి తరలించారు. మరోవైపు పుళల్ జైలు నుంచి రాబర్ట్ పయాస్, జయకుమార్‌లు విడుదలయ్యారు. శ్రీలంక జాతీయులు కావడంతో వీరినీ అక్కడికే తీసుకెళ్లారు. ఇదే కేసులో దోషిగా తేలి, ఇప్పటికే విడుదలైన పేరరివవాలన్, అతని తల్లి అంతకుముందు ఈ ఇద్దరిని జైలు బయట కలిశారు.
