రెబెల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియల స్థలం మారింది. హైదరాబాద్ లోని మహా ప్రస్థానంలో అంత్య క్రియలు జరుగుతాయని తొలుత ప్రకటించినా… ఆ తర్వాత మొయినాబాద్ లోని కనక మామిడి కృష్ణంరాజు ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం పదకొండున్నరకు అంతిమయాత్ర మొదలుకానుంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేసింది. ఇక… ఇంటి నుంచి ఉదయం 11:30 గంటలకు ఆయన పార్థివ దేహం బయలుదేరుతుందని, మధ్యాహ్నం 1 గంటలకు కృష్ణంరాజు పార్థివ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.

 

రెబల్ స్టార్ కృష్ణంరాజు నిన్న తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయనకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు .. ఒక కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. అయితే ఆమె రావాల్సి ఉండటంతో.. నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో 1940 జనవరి 20 న కృష్ణంరాజు జన్మించారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు. వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.