మెగాస్టార్ తో గడిపిన ప్రతి క్షణం ఎప్పటికీ గుర్తుంచుకుంటా : మాస్ మహారాజా రవితేజ

మెగాస్టార్ చిరంజీవి, మెయిన్ రోల్ లో మాస్ మహారాజా రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖ వేదికగా అద్భుతంగా జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ కార్యక్రమానికి హీరోయిన్ అయితే హీరోయిన్ శృతిహాసన్ ఫంక్షన్ కు అటెండ్ కాలేదు. ఈ సందర్భంగా మాస్ మహారాజా రవితేజ మాట్లాడాడు. మెగాస్టార్ చిరంజీవితో గడిపిన ప్రతి క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నాడు. అన్నయ్య చిరంజీవితో తన ప్రయాణం విజయవాడ నుంచి మొదలైందని, అక్కడొక గ్యాంగ్ వుండేదన్నాడు.

ఓ సారి విజయవాడకు చిరంజీవి వచ్చారని, కానీ.. తాను చూడలేకపోయానన్నారడు. కానీ.. ఫీలవ్వలేదని, ఏదో ఒక రోజు తానూ అక్కడికి వెళ్లి కూర్చుంటానన్న నమ్మకం అని వివరించాడు. సహాయ నటుడిగా మొదలై… అన్నయ్యకు తమ్ముడిగా మారి, ఇప్పుడు వాల్తేరు వీరయ్య దాకా ప్రయాణం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. వాల్తేరు వీరయ్య మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని, చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలిపాడు. ఈ సినిమాతో బాబీ మరో స్థాయికి వెళ్లిపోతాడని, మళ్లీ సక్సెస్ మీట్ లో కలుద్దాం అని రవితేజ ముగించాడు.

Related Posts

Latest News Updates