మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ షూటింగ్ పూర్తి

 

మాస్ మహారాజా రవితేజ,  క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ షూటింగ్ ఈరోజుతో పూర్తి కానుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో రవితేజ, హీరోహీరోయిన్లపై వేసిన భారీ సెట్‌లో శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. సుధీర్ వర్మ పర్ఫెక్ట్ ప్లానింగ్ వల్ల షూటింగ్ పార్ట్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చేసింది.

 

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రావణాసురు వేసవిలో విడుదలయ్యే క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఫస్ట్ గ్లింప్స్ రవితేజ పాత్రని   విభిన్న షేడ్స్ లో చూపించగా, థీమ్ నెంబర్,  రెండవ సింగిల్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో  అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత  తదితరులు నటిస్తున్నారు.

జనవరి నెలలో మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా పూజ కార్యక్రమంతో మొదలైన రావణాసుర మూవీ.. శర వేగంగా షూటింగ్ జరుపుకుంది. తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 26) ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కేవలం 40 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టిన మూవీ టీం ఇప్పటికే మూవీలోని సాంగ్స్ తో, వీడియో గ్లింప్స్ తో ఆకట్టుకుంటుంది.

Related Posts

Latest News Updates