‘రావణాసుర’ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌… ‘ప్యారన పాగల్’ సాంగ్ డేట్ ప్రకటన

వాల్తేరు వీరయ్యతో తెగ క్రేజ్ మీద వున్న మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే.. ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ మరొకటి వచ్చేసింది. ఈ చిత్రంలోని ప్యార్ లోనా పాగల్ అనే వీడియో సాంగ్ ను ఈ నెల 18 న విడుదల చేయనున్నారు. హర్షవర్ధన్‌ సరికొత్త ట్యూన్స్‌ శ్రోతలను ఆట్టుకుంటున్నాయి. మొదటి పాటలానే, ఈ పాట కూడా ఆకట్టుకుంటుందని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ నెగెటీవ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ర‌వితేజ‌కు జోడీగా అను ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లాలు న‌టిస్తున్నారు.

Related Posts

Latest News Updates