అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా పండుగాయల రత్నాకర్‌కు మూడో సారి పదవీ కాలాన్ని పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ మూడో సారి బాధ్యతలను తనకు అప్పగించడం పట్ల, తన పట్ల నమ్మకం ఉంచినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటానని అన్నారు. సీఎం జగన్‌తో కలిసి పని చేయడం తన అదృష్టమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేలా చేపడుతున్న వివిధ పనులను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉంటోన్న ప్రవాసాంధ్రులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని తెలిపారు.