నల్లగొండ జిల్లాలో నార్కట్‌పల్లిలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా  జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున రామలింగేశ్వరుని కల్యాణం కన్నులపండువగా జరిగింది. ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామి వారి కల్యాణానికి తలంబ్రాలు సమర్పించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచారు. దీంతో శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతున్నది. ఫిబ్రవరి 2 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. మంగళవారం వేకువజామున 4 గంటలకు అగ్నిగుండాలు నిర్వహిస్తారు.