రాజమౌళిపై రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్… ఏంటంటే…

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శక ధీరుడు రాజమౌళిపై చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంది. ఇటీవలే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. ప్రఖ్యాత హాలివుడ్ దర్శకుడు జేమ్స్ కేమెరూన్ అయితే.. తెగ మెచ్చుకున్నారు. రాజమౌళిని ప్రశంసించారు. ఓ సినిమా కూడా చేద్దామంటూ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ రాజమౌళే ప్రకటించారు.

 

అయితే… ఈ సమయంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ దుమ్ము దుమారం రేపుతోంది. రాజమౌళి సార్…‘దయచేసి మీ భద్రతను పెంచుకోండి. ఎందుకంటే భారతదేశంలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ మీ మీద అసూయతో ఉన్నారు. అందుకే మిమ్మల్ని చంపడానికి ఓ గ్రూప్‌నే ఏర్పాటు చేశారు. అందులో నేను కూడా భాగమే.. నేను 4 పెగ్గులు వేశాను. అందుకే ఈ రహస్యాన్ని బయటపెడుతున్నాను’అంటూ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా మరో ట్వీట్ కూడా చేశాడు. ‘దాదా సాహబ్ ఫాల్కే నుండి ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో ఎస్ ఎస్ రాజమౌళితో కలుపుకుని ఎవరూ కూడా ఒక భారతీయ దర్శకుడికి ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించి ఉండరు. అంటూ ట్వీట్ చేశారు.

 

 

 

Related Posts

Latest News Updates