క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారిని హీరో రామ్ చరణ్ కలుసుకున్నాడు. ఆ తొమ్మిదేళ్ల మణికుశాల్ అనే చిన్నారి తన అభిమాని అని తెలుసుకున్న చరణ్… హైదరాబాద్ లోని స్పర్శ్ ఆస్పత్రికి వెళ్లాడు. ఆ చిన్నారిని కలిసి, మానసిక ధైర్యాన్ని కల్పించాడు. తనకు రామ్ చరణ్ అంటే ఇష్టమని, ఆయన్ను చూడాలని చిన్నారి తల్లిదండ్రులతో అన్నాడు. ఈ విషయం చివరికి చరణ్ చెవిన పడింది. వెంటనే షూటింగ్ లో బిజీ వున్నా… వెంటనే ఆస్పత్రికి వెళ్లి, తన అభిమాన చిన్నారిని కలుసుకున్నాడు. ధైర్యం నింపాడు. త్వరగో కోలుకుంటాడని కుటుంబీకులకు ధైర్యం చెప్పాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చరణ్ తన పెద్ద మనసును చాటుకున్నాడని నెటిజన్స్ అభినందిస్తున్నారు.
RamCharan met a 9 years old kid through #MakeaWishFoundation , he is suffering from cancer. The kid’s wish of meeting his favourite star was fulfilled with the actor spending quality time with him. pic.twitter.com/703ci6coiE
— Team RamCharan (@AlwayzRamCharan) February 9, 2023













