అత్యంత గ్రాండ్ గా రాంచరణ్ బర్త్ డే వేడుకలు.. స్పెషల్ అట్రాక్షన్ గా RRR టీమ్

చిరంజీవి నివాసంలో రాంచరణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. RRR టీమ్ తో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే.. రాంచరణ్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే యంగ్ హీరోలు నిఖిల్, అడవి శేష్ తో పాటు రాజమౌళి, కీరవాణి, నాగార్జున, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, వెంకటేష్,అమల, నాగచైతన్య, అఖిల్, కాజల్ అగర్వాల్, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ కృష్ణ వంశీ, అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి ఈ సందర్భంగా ఆస్కార్ గెలుచుహుకున్న ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) సినిమా దర్శకుడు రాజ‌మౌళి స‌హా RRR మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ఎం.ఎం.కీర‌వాణి, నిర్మాత డి.వి.వి.దాన‌య్య‌, సినిమాటోగ్ర‌ఫర్ కె.కె.సెంథిల్ కుమార్‌, గాయకులూ ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌, రాహుల్ సిప్లిగంజ్‌, కాల భైర‌వ లను సన్మానించారు.

 

Related Posts

Latest News Updates