రాజ్ నాథ్ సింగ్ కి కరోనా పాజిటివ్… కార్యక్రమాలన్నీ రద్దు

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా… ఆ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో రాజ్ నాథ్ హోం క్వారంటైన్ లోనే వుండిపోయారు. షెడ్యూల్ ప్రకారం రాజ్ నాథ్ వైమానిక దళం కమాండర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనాల్సి వుంది. కానీ.. కరోనా అని తేలడంతో ఆయన కార్యక్రమానికి దూరంగా వుండిపోయారు. అయితే… ఆయనకు కరోనా లక్షణాలు స్వల్పంగానే వున్నాయని, డాక్టర్లు ఆయన్ను పరీక్షించారని, వారి సూచన మేరకు రెస్ట్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో కరోనా కేసులు కూడా విపరీతంగా పెరిగి పోతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 13 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసు సంఖ్య 65 వేలు దాటింది.

Related Posts

Latest News Updates