పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1971 లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలోనే గట్టి నిర్ణయం తీసుకొని వుండాల్సిందన్నారు. ఈ యుద్ధం ఆస్తుల కోసమో, అధికారం కోసమో జరిగిన యుద్ధం కాదన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని నాదౌన్ లో అమరవీరుల కుటుంబాలను ఆయన సత్కరించారు. అప్పటి యుద్ధం మానవత్వం కోసం పోరాడిన యుద్ధమని, ప్రత్యర్థిపై విజయం సాధించామన్నారు. కానీ… అప్పుడే ఓ నిర్ణయం తీసుకోలేకపోయారన్న బాధ కూడా వుంటుందన్నారు.