అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్న రాజ్ నాథ్… ఉభయ సభల వేదికగా ప్రకటన

భారత్, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల జవాన్ల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత భద్రతా పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీడీఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, కేంద్ర హోంశాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకూ జరిగిన విషయాలను అధికారులు రక్షణ మంత్రి రాజ్ నాథ్ కు రిపోర్ట్ చేశారు. మరోవైపు… ఈ వివాదంపై మంత్రి రాజ్ నాథ్ నేడు లోక్ సభలో ఓ ప్రకటన విడుదల చేయనున్నారు.

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు కూడా గాయపడ్డారు. అయితే.. చైనా సైనికులే అధిక సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. ఈ నెల 9 న చైనా సైనికులు తవాంగ్ సెక్టార్ ప్రాంతంలోని సున్నిత ప్రదేశంలోకి అడుపెట్టినట్లు తెలుస్తోంది. వారిని మన దేశ సైనికులు వారిని అడ్డుకున్నాయని, దీంతో ఘర్షణ తలెత్తిందని భారత సైన్యం పేర్కొంది.

Related Posts

Latest News Updates