మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుల విషయంలో సుప్రీం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుతో సంబంధముండి, జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందర్నీ విడుదల చేయాలని ఆదేశించింది. గతంలో హత్య కేసులో నిందితుడిగా ఉన్న పెరారివాలన్ కు నిర్దేశించిన గైడ్ లైన్సే మిగిలిన దోషులకు కూడా వర్తిస్తాయని తెలిపింది. 2022 మే 18న పెరరివాలన్ ను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును మిగిలిన దోషులకు కూడా వర్తింపజేసింది సుప్రీంకోర్టు.దీంతో దోషులు నళిని, జయకుమార్, ఆర్పీ రవిచంద్రన్, రాబర్ట్ పియాస్, సుతేంద్ర రాజా, శ్రీహరన్ లను విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది.
దోషులు జైలులో మంచి నడవడికతో ఉన్నారని, జైలులో ఉన్న సమయంలో వివిధ డిగ్రీలు పూర్తి చేశారని కోర్టు తెలిపింది. ఈ కేసులో మూడు దశాబ్దాలకు పైగా శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్ ను విడుదల చేయాలని మే 18 న సుప్రీం ఉత్తర్వులిచ్చింది. అయితే… తమను కూడా ముందస్తుగా విడుదల చేయాలని ఇతర దోషుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ బి.వి. నాగరత్నంతో కూడిన ధర్మాసనం విచారించి, తీర్పునిచ్చింది.












