రాష్ట్రపతి పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించిన అధికారి సస్పెండ్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వ మహిళా ఇంజినీర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 3,4 తేదీల్లో రాష్ట్రపతి ముర్ము రాజస్థాన్ లో పర్యటించారు. ఇందులో భాగంగా రోహత్ లోని స్కౌట్ గైడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలోనే ప్రజారోగ్యం డిపార్ట్ మెంట్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్న అంబా సియోల్… ప్రోటోకాల్ ను ఉల్లంఘించి, అడుగు ముందుకేసి, రాష్ట్రపతి పాదాలను నమస్కరించేందుకు ప్రయత్నించారు.

దీంతో రాష్ట్రపతి ముర్ము వ్యక్తిగత సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్ గా తీసుకుంది. వెంటనే తమకు సమగ్ర రిపోర్ట్ ను సమర్పించాలని ఆదేశించింది. స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం ఆ అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Related Posts

Latest News Updates