నిన్న రిలీజైన కల్కి లో మహాభారతానికి సంబంధించి కొన్ని నిమిషాల సీక్వెల్స్ ను చూపించి ఆడియన్స్ కు ఎంతో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కేవలం అర్జునుడు, కృష్ణుడు, అశ్వత్థామ, కర్ణుడు మధ్య జరిగే ఎపిసోడ్స్ ను మాత్రమే నాగ్ అశ్విన్ కల్కిలో చూపించాడు. అయినా సరే దీనిపై ఇప్పుడు అభిమానుల్లో పెద్ద ఎత్తున డిస్కషన్స్ జరుగుతున్నాయి.
దీనికే ఇలా ఉంటే ఒకవేళ రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహా భారతాన్ని మొదలుపెడితే అది చరిత్రలోనే గొప్ప మాస్టర్ క్లాస్ సినిమా అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. రాజమౌళికి ఎంతో ఇష్టమైన సినిమాల్లో దాన వీర శూర కర్ణ ఫస్ట్ ఉంటుంది. అలాంటి సినిమాను ఇప్టపి టెక్నాలజీ వాడి తన మార్క్ ఎలివేషన్స్, ఎమోషన్స్ కరెక్ట్ పడితే ఆడియన్స్ పిచ్చోళ్లైపోవడం ఖాయం.
అలా అని దీన్ని ఒకటి రెండు భాగాల్లో తీయడం కష్టం. నిజంగా ఆయన ఈ మహా భారతాన్ని తీస్తే అది నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికైనా తన కెరీర్లో మహా భారతం తీయడమే తన జీవితాశయంగా రాజమౌళి చెప్తాడు. కల్కిలో రాజమౌళి క్యామియో చేయడానికి కారణం కూడా మహా భారతం మీదున్న ఇష్టమేనని కొందరంటున్నారు.