దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచం మొత్తం ప్రశంసలు పొందుతోంది. తాజాగా… అంతర్జాతీయ అవార్డును కూడా తీసుకుంది. తాజాగా.. ఈ సినిమాపై హాలివుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ కూడా ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని వివరిస్తూ జక్కన్న ట్వీట్ చేశారు. ప్రముఖ దర్శకుడు కామెరూన్ ఆర్ఆర్ఆర్ సినిమా చూశారు. ఆయనకు ఈ సినిమా ఎంతో నచ్చింది. తన భార్యను కూడా ఈ చిత్రం చూడాలని కోరారు. ఆమెతో కలిసి మరోసారి సినిమా చూశారు అని రాజమౌళి తెలిపారు. కామెరూన్ ఆర్ఆర్ఆర్ సినిమా చూడటంతో తన ఆనందానికి హద్దుల్లేవని అన్నారు. సర్.. మీరు మా సినిమాని విశ్లేషించడానికి మాతో మొత్తం 10 నిమిషాలు గడిపారని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మీరు చెప్పినట్లు నేను ప్రపంచంలోనే టాప్ కాదు. ఇద్దరికీ ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు.
https://twitter.com/ssrajamouli/status/1614833506521321475?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1614833506521321475%7Ctwgr%5E466c1c6a2539278d0ec2a0240494cc189e1bf79c%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fssrajamouli%2Fstatus%2F1614833506521321475