ఆర్ఆర్ఆర్ సినిమా భారత దేశం తరపున ఆస్కార్ కి ఎంట్రీ కాకపోవడంపై తానెంతో బాధపడ్డానని దర్శక ధీరుడు రాజమౌళి వెల్లడించాడు. అయితే… దాని గురించే ఆలోచిస్తూ… వుండిపోనని కూడా స్పష్టత ఇచ్చాడు. ఎంట్రీని ఎందుకు సాధించలేకపోయాం? అని ఆలోచిస్తూనే కూర్చుండిపోయే వ్యక్తిని మాత్రం కాదన్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఎంట్రీ ఇస్తే బాగుండేదని విదేశీయులు కూడా భావించారన్నారు. కానీ, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు నాకు తెలియదు. అందువల్ల దాని గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదని పేర్కొన్నాడు.
స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీతరామరాజు, కొమరం భీమ్‌ల స్ఫూర్తితో ‘ఆర్ఆర్ఆర్’ ను రూపొందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలు పోషించారు. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా సంచలన విజయం సాధించింది. గోల్డెన్ గ్లోబ్‌ను కూడా ఈ మూవీ సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది.












