త్వరలో ఏపీకి కూడా వందే భారత్ రైలు : అశ్వనీ వైష్ణవ్ ప్రకటన

త్వరలోనే ఏపీకి కూడా వందే భారత్ రైలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌లో అనేక మార్పులు వస్తున్నాయని, ఈ 8 ఏళ్లలో రైల్వే రంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్నామని ప్రకటించారు. విశాఖ ఏయూ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీతో పాటు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. భారతీయ రైల్వేలోని రైళ్లు, ప్లాట్‌ఫాంలు, సౌకర్యాల కల్పన మరింత పెరిగిందన్నారు. రూ.446 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఆధునికీకరిస్తామని, గత 8 ఏళ్లలో రైల్వే అభివృద్ధి పథంలో నడుస్తోంది. అన్ని రైల్వే స్టేషన్లలో ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఏపీకి రూ.7,032 కోట్లు వచ్చాయని గుర్తు చేశారు.

Related Posts

Latest News Updates