కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఖండించారు. రాహుల్‌పై అనర్హత వేటు, గాంధీ సిద్ధాంతాలకు, భారత దేశ విలువలకు తీవ్ర ద్రోహం చేయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇందు కోసం కాదు మా తాత ఏండ్ల పాటు జైలు జీవితం గడిపింది. మోదీజీ, భారత ప్రజాస్వామ్యం కోసం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే అధికారం మీకు ఉన్నది. అంటూ రో ఖన్నా తన ట్విట్టర్ పోస్టులో ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు. రాహుల్‌పై అనర్హత వేటు అంశంపై న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన కథనాన్ని కూడా జతచేశారు. రో ఖన్నా తాత అమర్నాథ్ విద్యాలంకార్ భారత స్వాతంత్య్ర పోరాటంలో లాలా లజపతిరాయ్‌తో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో కొన్నేండ్ల పాటు జైలు జీవితం గడిపారు.