కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అధికార బంగ్లాను శనివారం ఖాళీ చేశారు. సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించడంతో వయనాడ్ ఎంపీగా రాహుల్పై అనర్హత వేటు పడింది. దీంతో ఏప్రిల్ 22లోగా ఇంటిని ఖాళీ చేయాలని పార్లమెంట్ సచివాలయం ఆయనకు నోటీసులు జారీ చేయగా, ఆయన ఇంటిని ఖాళీ చేశారు. వాస్తవాలు మాట్లాడినందుకు తనకు అందిన మూల్యం ఇదని రాహుల్ మీడియాకు వెల్లడించారు. 19 ఏండ్ల పాటు ఆయన ఈ ఇంటిలోనే నివాసం ఉన్నారు. మోదీ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయనపై అనర్హత వేటు విధించిన సంగతి తెలిసిందే. ఎంపీ నివాసాన్ని ఖాళీ చేయాలని నోటీసులు రావడంతో రాహుల్ వెంటనే స్పందించారు.