కమెడియన్ రాహుల్ రామకృష్ణ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పాడు. సంక్రాంతి పర్వదినాన తను తండ్రియినట్లు చెప్పాడు.న భార్య హరిత పండంటి మగబిడ్డకు జన్మినిచ్చినట్లు సోషల్ మీడియలో ప్రకటించాడు. ‘బాయ్.. సంక్రాంతి రిలీజ్’ అంటూ తన కొడుకు ఫోటోను షేర్ చేశాడు. దాంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తల్లికి దగ్గరగా ఉండి.. హాయిగా నిద్రిస్తున్న పసిపిల్లాడి ఫొటోతో పాటు ఈ కామెంట్ ను కూడా ఆడ్ చేశాడు రాహుల్ రామకృష్ణ. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాహుల్ పోస్ట్ కు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రాహుల్ రామకృష్ణకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు.
Boy.
Sankranthi release. pic.twitter.com/SeU0Vo6BB1— Rahul Ramakrishna (@eyrahul) January 16, 2023