సూరత్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎదురు దెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్ష తీర్పుపై స్టే ఇవ్వాలని రాహుల్ సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం… రాహుల్ పిటిషన్ ను కొట్టేసింది. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోడీ ఇంటిపేరుతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్‌కు చెందిన బీజేపీ నేత పూర్ణేశ్ మోదీ కోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో రాహుల్ కి 2 సంవత్సరాల పాటు జైలుశిక్ష పడింది. ఎంపీ పదవిపై అనర్హత వేటు కూడా పడింది. మరోవైపు శుక్రవారం రాహుల్ ఇదే కేసులో గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు.