కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక- సుగినేకళ్ లో ఓటు వేయనున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్నారు. కర్ణాటక సరిహద్దులోని ఏపీలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఏపీ, కర్ణాటక సరిహద్దు గ్రామం సుగినేకళ్ లో ఏర్పాటు చేసిన క్యాంపులో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాహుల్ తో యాత్రలో సాగుతున్న ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు. ఇక యాత్రలో పాలుపంచుకుంటున్న ఏపీ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కర్నూలులో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు

..కాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ సోమవారం జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగిన నేతలంతా ఆయా రాష్ట్రాల్లోనే ఓటు హక్కు వినియోగించుకునేలా పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తాత్కాతిక అధ్యక్షురాలుగా ప్రస్తుతం సోనియా గాంధీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యం దృష్ట్యా ఆమె పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సైతం బాధ్యతలు తీసుకునేందుకు ససేమిరా అనడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.

Related Posts

Latest News Updates