చైనా నుంచి భూమిని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు? రాహుల్ ట్వీట్

చైనా విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శించారు. మోదీ ప్రభుత్వం దాదాపు 1,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేసిందని ఆరోపించారు. ఎలాంటి పోరాటం లేకుండానే ఇచ్చేసిందని, దానిని ఎలా తిరిగి స్వాధీనం చేసుకుంటారో చెప్పాలని ట్వీట్ చేశారు. ఎంత మేర భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటారో ప్రభుత్వం చెప్పగలదా? అని బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో ప్రశ్నించారు.

Related Posts

Latest News Updates