కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ ని దోషిగా నిర్ధారించింది. దొంగలందరికీ మోదీ ఇంటిపేరు అంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. 2019 లోకసభ ఎన్నికల సమయంలో కర్నాటకలో జరిగిన ప్రచార సభలో రాహుల్ ఈ విమర్శలకు దిగారు. దీంతో గుజరాత్ బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఈ శిక్ష విధించింది. కాగా రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. కోర్టు నిర్ణయాన్ని సవాలు చేసేందుకు వీలుగా రాహుల్ శిక్షను 30 రోజలుపాటు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. అయితే.. కోర్టు ఈ తీర్పు వెలువరించే సమయంలో రాహుల్ గాంధీ కోర్టులోనే వున్నారు. అయితే ఓ రోజు ముందే సూరత్ కి వచ్చిన రాహుల్ కి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. షేర్ హిందుస్తాన్ అంటూ నినాదాలు కూడా చేశారు.












