తనకు కాబోయే భార్య ఎలా వుండాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెల్లడించారు. ఇలాంటి విషయాలపై రాహుల్ మాట్లాడటం ఇదే ప్రథమం. తన తల్లి సోనియా గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీలోని సుగుణాలతో కూడిన అమ్మాయి అయితే తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని తెలిపారు. అమ్మ, నానమ్మలోని లక్షణాలు ఉన్న మహిళ అయితే మంచిదని వ్యాఖ్యానించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ పై వ్యాఖ్యలు చేశారు.
తన నాయనమ్మ ఇందిరా గాంధీ తనకు రెండో తల్లి అని రాహుల్ అభివర్ణించారు. ఇక… తనకు కార్లంటే అంతగా ఇష్టం ఉండదని రాహుల్ గాంధీ తెలిపారు. ఇప్పటికీ సొంత కారు కూడా లేదన్నారు. ఇంట్లో సీఆర్-వీ ఉందని..అందులో అమ్మ ప్రయాణిస్తుందని చెప్పారు. కార్లు నచ్చకపోయినా..వాటిని రిపేర్ మాత్రం చేస్తానన్నారు. కార్లలో వచ్చే సాంకేతిక సమస్యలు తనకు 90శాతం వరకు తెలుసన్నారు.












