ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వీర సావర్కర్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మళ్లీ విమర్శలు చేశారు. స్వాతంత్రం సమయంలో గాంధీ, నెహ్రూ ఆంగ్లేయులకు క్షమాపణలు చెప్పలేదు కానీ… సావర్కర్ మాత్రం క్షమాపణలు చెప్పారని ఆరోపించారు. ఈ సందర్భంగా కొన్ని ఆధారాలు చూపారు. ఆంగ్లేయులకు భయపడే… ప్రాణభిక్ష పెట్టాలంటూ లేఖ రాశారని పేర్కొన్నారు. వీర సావర్కర్ బీజేపీ, ఆరెస్సెస్ చిహ్నమని విమర్శించారు.
అయితే… ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమ్ము దుమారమే రేపుతున్నాయి. బీజేపీ, ఉద్ధవ్ శివసేన వర్గం తీవ్రంగా స్పందించింది. హిందుత్వ సిద్ధాంతాలను అవమానపరుస్తున్న రాహుల్ కు మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అన్నారు. ఇక రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సీఎం ఏకనాథ్ పేర్కొన్నారు. ఉద్ధవ్ థాకరే కూడా మండిపడ్డారు. వీర సావర్కర్ అంటే తమ పార్టీకి అపార గౌరవమని, రాహుల్ వ్యాఖ్యలకు ధ్రువీకరించమని అన్నారు.












