పంజాబ్ లోకి భారత్ జోడో యాత్ర.. బీజేపీ ద్వేషం పెంచుతోందని రాహుల్ విసుర్లు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పంజాబ్ లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా గురుద్వారా ఫతేగడ్ సాహిబ్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం రాహుల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచుతోందని విమర్శించారు. భారత్ సోదరభావం, ఐక్యత, గౌరవంతో కూడిందని, అందుకే తన యాత్ర విజయవంతం అయ్యిందని వివరించారు.

భారత్ జోడో యాత్ర భారీ ప్రసంగాలు చేయడానికి కాదని..ప్రజలు చెప్పేది వినడానికే యాత్ర చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటివి పెరిగిపోయాయని… ఆ సమస్యలను యాత్ర ద్వారా లేవనెత్తి..ప్రజలతో కలిసి పోరాటం చేయవచ్చనే ఉద్దేశతో యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. దేశం మత సామరస్యం, ఐక్యత, గౌరవానికి సూచిక అని చెప్పారు.

Related Posts

Latest News Updates