తెలుగు సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి లక్ష్మీ నారాయణ రావు (90) మరణించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామం ఆయన స్వస్థలం. కుంచె లక్ష్మీ నారాయణరావు 1933 లో జన్మించారు. ఆయనకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు, ఇద్దరు కుమార్తెలు వున్నారు. లక్ష్మీ నారాయణ అంత్యక్రియలు నేడు స్వగ్రామంలో నిర్వహించనున్నారు. లక్ష్మీ నారాయణ హోమియోపతి వైద్యులుగా గుర్తింపు పొందారు.













